Skip to main content

Anti Smoking Day - Smoking is injurious to health


🌐🚬⚔➖➖➖➖➖➖➖
*నేడు ప్రపంచ ధూమపాన వ్యతిరేక దినోత్సవం (Anti Smoking Day)..*✍ 
➖➖➖➖➖➖➖🚭🌸🍃
_2017 థీమ్:“పొగాకు- అభివృధ్ధికి విఘాతం”_
*Smoking is injurious to health..*
 
★ పొగాకుతో నేడు ఎన్నో అనారోగ్యాలు సంభవిస్తున్నాయి. సిగరెట్‌ తాగడం వల్ల గుండె, ఊపిరతిత్తులకు సంబంధించిన వ్యాధులతో పాటు క్యాన్సర్‌, డయాబెటిస్‌, ఆస్టియోపొరోసిస్‌ వంటి వ్యాధులు వస్తున్నాయి. ఆస్తమా రావడానికి సిగరెట్‌ తాగడం కూడా ఓ కారణమే. 

*■ పొగ తాగడం వల్ల ప్రపంచవ్యాప్తంగా ప్రతి 13 సెకండ్లకు ఒక వ్యక్తి మరణిస్తే ప్రతి ఏడాది మిలియన్‌ మంది ప్రజలు దీంతో మృతిచెందుతున్నారు. దీంతో పాటు పొగాకుతో కూడిన గుట్కా కూడా మనిషికి ప్రాణాంతకంగా మారుతోంది. ఈ నేపథ్యంలో పొగాకు మూలంగా సంభవించే వ్యాధులపట్ల చైతన్యం కలిగించేందుకు ప్రతి ఏటా మే 31న ‘వరల్డ్‌ నో టొబాకో డే’ను నిర్వహిస్తున్నారు.ప్రతి సం"ఒక రోజు ఈ దినోత్సవాన్ని జరిపి ప్రజలకు పొగ త్రాగడం వలన వచ్చే అనారొగ్యము గురించి తెలియజెప్పడమే ముఖ్య ఉద్దేశము.*

*■ ఐక్యరాజ్య సమితి 1998లో ప్రపంచ పొగాకు రహిత దినోత్సవాన్ని ప్రకటించిన సంవత్సర కాలంలోనే 168 దేశాలతోపాటు యూరోపియన్ సమాజం ఇందులో భాగస్వాములు కావడం, దూకుడుగా తమ దేశాలను పొగాకురహిత సమాజంగా రూపొందించడం కోసం కార్యాచరణ ప్రారంభించాయి.*

■ ధూమపానం చేయడం నేడు ఫ్యాషన్ అయిపోయింది. ఎవరింట్లోనైతే పెద్దలు ధూమపానం చేస్తుంటారో ఆ ఇంట్లోని పిల్లల ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావం చూపిస్తుంది. ధూమపానం చేసేవారికన్నా ఆ వ్యక్తి చుట్టుపక్కలనున్న వ్యక్తి ఆరోగ్యంపై పొగ ప్రభావం అధికంగా ఉంటుందంటున్నారు ఆరోగ్య నిపుణులు.

*■ ధూమపానము రక రకాలుగా ప్రజలలోకి చొచ్చుకుపోయినది . నాగరికులు - సిగారేట్టుగాను , పండితులు -ముక్కుపోడుము గాను ,విలాసవంతులు -తంబాకు , కారా కిల్లీగాను ,సామాన్యులు పొగ చుట్టాలు గా , పేదలు బీడీలుగా దీనిని సేవిస్తున్నారు .ఇన్ని రకాలుగా ఇది (పొగాకు) లభించడం తో దీనికి తోడుగా " ఖైనీలు , గుట్కాలు , పాన్పరాగ్ , " మున్నగు రాకకాల పేర్ల తో పొగాకు ఉత్పత్తులు లభిస్తున్నాయి.గ్రామీణ ప్రాంతం లో వీటి వినియోగం ఎక్కువగా ఉంటున్నాయి . గ్రామీణ మహిళలు అడ్డపోగా చుట్టాను కాలుస్తారు .. ఇది నోటి కాన్సర్ కు దారితీస్తుంది . పొగ "క్షయ" వ్యాది కి కారణమవుతుంది.*

*🍥ధూమ పానము వలన కలిగే అనర్ధాలు..*

■ ఏటా 7 లక్షలమంది ధూమపానం కారణంగా మరణిస్తున్నారు.. సిగరెట్టు, బీడీ, చుట్ట, పొగాకు వంటి పదార్ధాలు తాత్కాలిక ఆనంద్నా కలిగిస్తున్నా అధికశాతం నష్ట్నా మాత్రం కలిగిస్తున్నాయి . గుండెజబ్బులకు, రక్తం గడ్డకట్టి వచ్చే పక్షవాతం వంటి వ్యాధులకు, ఊపిరితిత్తుల క్యాన్సర్‌కు కారణమయ్యే ధూమపానమును పూర్తిస్థాయిలో అరికట్టాల్సిన అవసరం ఉన్నది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు సిగరెట్, బీడీ వంటి పొగాకు పదార్థాల ప్యాకెట్లపై తేలు బొమ్మ, కాన్సర్ లేదా కాన్సర్ రోగి బొమ్మను ముద్రించాలని ప్రకటించడం హర్షదాయకము . ధూమపాన వ్యతిరేకతను ప్రచారం చేసే స్టాల్ల్స్ ను ఎక్కువగా ఏర్పాటు చేస్తే బాగుంటుంది .

■  బహిరంగ ప్రదేశాల్లో, పాఠశాలల పరిసరాల్లో పొగతాగడంపై నిషేధం, 18 ఏళ్లలోపు వారికి పొగాకు ఉత్పత్తులు అమ్మకుండా చూడటం వంటి అంశాలు ఈ సంస్థ పరిధిలోకి వస్తాయన్నారు. బీడీ, సిగరెట్‌ పెట్టెలపై చట్టబద్ధమైన హెచ్చరికల ముద్రణ, వాటిల్లో తార్‌, నికోటిన్‌ ఏస్థాయిలో ఉన్నాయన్న విషయాన్ని స్పష్టంగా చెబుతున్నారో లేదో కూడా పరిశీలిస్తుందన్నారు.

*◆ మధ్య వయసు వారికి... ధూమాపానం అలవాటు.. అధిక రక్తపోటు...అధిక కొలిస్టిరాల్‌ ఉంటే 10 నుంచి 15 ఏళ్లకు ముందే మరణిస్తారు...*

■ మనదేశ జనాభాలో సుమారు 25కోట్లకు పైగా పొగరాయుళ్లేనట. అందుకే ఏటా 10,000 కోట్లకుపైగా సిగరెట్లు తయారవుతు న్నాయి! ఈ లెక్కన ప్రపంచవ్యాప్తంగా ఎన్ని కోట్ల సిగరెట్లు తయారవుతున్నాయో, ఎంతమంది వాటిని వూదేస్తూ ఆరోగ్యాన్నీ తద్వారా జీవితాల్నీ కాల్చేసుకుంటున్నారో వూహించుకోవడానికే కష్టం..

*■ సిగరెట్‌ గురించి ఎంత మంది కవులూ, సినీ రచయితలు ఎన్ని విధాలుగా వర్ణించినా .. పొగతాగుట హానికరం అన్న సంగతి వైద్యులు ఏనాటి నుంచో చెబుతూనే వున్నారు. ప్రభుత్వాలు సైతం సిగరేట్‌ తాగడంపై అనేక ఆంక్షలు విధించింది. తాగే వాడికన్నా వాడు గుప్పు గుప్పు మంటూ వదిలే పొగ పీల్చిన వారికి సైతం హాని ఉండటంతో పలు చర్యలు చేపట్టింది. బహిరంగ ప్రదేశాలలో, బస్టాండ్‌, పాఠశాలలు, ఆసుపత్రులు, సినిమా హాళ్లు తదితర ప్రదేశాలలో పొగతాగటాన్ని నిషేధించింది. పొగతాగడం వల్ల ఊపిరితిత్తుల క్యాన్సర్‌ లాంటి ప్రాణాంతక వ్యాధులు సంభవించే ప్రమాదం వుంది. దీంతో వైద్య, ఆరోగ్యరంగానికి కేటాయింపులు పెంచాల్సి రావడంతో ధూమపానం వల్ల ఒనగూరే నష్టాలను ప్రచారం చేసేందుకు ప్రభుత్వం సిద్ధపడింది. దీనిలో భాగంగా 'బహిరంగ ప్రదేశాలలో పొగతాగడాన్ని నిషేధిస్తూ ఉల్లంఘించిన వారికి రూ.200 వరకు జరిమానా విధించే వీలుకల్పించింది. ప్రభుత్వ సంకల్పం బాగున్నా ఆచరణలో చిత్తశుద్ధి లేకపోవడంతో ఆశించిన ఫలితాలు ఒనగూరడంలేదు.*
 
■ ఈనేపథ్యంలో ప్రభుత్వంతో పాటు స్వచ్చంధ సంస్థలు పొగతాగడం వల్ల ఒనగూరే అనర్ధాలను విరివిగా ప్రచారం చేయాల్సి వుండగా ఆవిధంగా జరగడం లేదన్న అభిప్రాయం వ్యక్తమౌతోంది. ఫలితంగా ధూమపాన వ్యతిరేక ప్రచారం ప్రకటనలకే పరిమితమౌతోందన్న విమర్శలు చోటుచేసుకుంటున్నాయి.

■ సెకండ్ హ్యాండ్ స్మోకింగ్ కారణంగా పిల్లల్లో ఆస్తమా రోగుల సంఖ్య నానాటికీ పెరిగిపో తుంది. ధూమపానం ద్వారా వచ్చే పొగ వలన నిమోనియా లేదా పల్మోనరీ బ్రాంకటైస్ అంటే శ్వాసతోపాటు వచ్చే దగ్గు ఉత్పన్నమౌతుంది.

★ పిల్లల్లో వారిలో వినికిడి, వాచక సమస్యలు తలెత్తుతాయి. ధూమపానం చేసేవారిండ్ల లోనున్న పిల్లలకు ఊపిరితిత్తుల సమస్యలు తలెత్తుతాయి. పొగ వలన వారిలో వ్యాధి నిరోధక సమస్యలు ఉత్పన్నమౌతాయి. ఇలాంటి పిల్లలు యువావస్థలోకి వచ్చే ముందు ఇతరులకన్నా బలహీనంగా కపడతారు.

*■ 21వ శతాబ్దం చివరి నాటికి ధూమపానం చేసేవారి సంఖ్య ఆరో కోట్ల ఇరవై లక్షల మంది తమ ప్రాణాలను కోల్పోనున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ వర్గాలు అభిప్రాయపడు తున్నాయి. ప్రపంచంలోని అభివృద్ధి చెందిన దేశాల్లో ప్రతి ఆరుగురిలో ఒకరి మృత్యువు కేవలం ధూమపానం కారణంగానేనని డబ్ల్యూహెచ్ఓ తెలిపింది. ప్రస్తుతం ఫ్యాషన్ పేరుతో మహిళల్లోను ధూమపానం చేసేవారు అధికమౌతున్నారు. దీంతో ఈ సంఖ్య మరింత పెరిగే ప్రమాదముందని డబ్ల్యూహెచ్ఓ ఆందోళన వ్యక్తం చేసింది.*

*■ ప్రపంచ పొగాకు దినోత్సవం 2017 సం.గాను “పొగాకు- అభివృధ్ధికి విఘాతం” అనే నేపధ్యాన్ని (Theme) ను ప్రకటిస్తూ నేడు ప్రపంచానికి పట్టిన చీడ, పీడ రెండూ పొగాకుయేనని వివరించింది. ఈసందర్బంగా పోస్టర్ విడుదల చేస్తూ పొగాకు వినిమయాన్ని తగ్గించడానికి ప్రభావంతమైన విధానాలకోసం  కృషిచేయాలని కోరింది. స్థిరాభివృధ్ధికీ, స్థిరాభివృధ్ధిని అందుకోవడానికి జరిగే కృషికీ పొగాకు పరిశ్రమ కల్గించే విఘాతాన్నీ ఎదుర్కోవలని విజ్ఞప్తి చేసింది.*

◆ తొలిపొగాకు రహితగ్రామం మనం ఆటవిక  జాతులుగానూ, ఆదివాసులుగానూ భావించే ఈశాన్య రాష్ట్రమైన నాగాలాండ్, కోహిమా జిల్లాలోని గరిఫెమా బావే గ్రామం 2014 సంవత్సరం దేశంలోనే మొదటి “ధూమపాన రహిత గ్రామంగా” ప్రకటించబడ్డది. గ్రామ పంచాయితీ, గ్రామ దార్శనికుల బృందం, గ్రామ విధ్యార్ధుల సంఘం సమిష్టి కృషితో ఈ విజయం సాకారమైంది. 

★ ఏదేనీ దురలవాటును దూరం చేయాలంటే విద్యను, విజ్ఞానాన్ని కల్గించడం, అమలుకు నియమంతో ప్రయత్నించడం రెండూ అవసరమేనని తెలుసుకొని గట్టిగా కృషిచేస్తే,
మరణాలు తగ్గుతాయని ఆశించవచ్చు..

Comments

Popular posts from this blog

గిడుగు వెంకట రామమూర్తి - జీవిత విశేషాలు !!

తెలుగు భాషా దినోత్సవం శుభాకాంక్షలు గిడుగు వెంకట రామమూర్తి సంఘ సంస్కర్తలు / ఆధునిక కవులు తల్లిదండ్రులు: వీర్రాజు, వెంకమ్మ స్వస్థలం:పర్వతాలపేట, ముఖలింగ క్షేత్రం, ...

అభ్యుదయ సాహితీ వేత్త - 'ఆరుద్ర' !!

అభ్యుదయ సాహితీ వేత్త..భాగవతుల సదాశివశంకర శాస్త్రి(ఆరుద్ర)గారి వర్దంతి(4-June) ★ అభ్యుదయ సాహిత్యంలో పరిచయం అవసరం లేని సాహితీ మూర్తుల్లో ఆరుద్ర ఒకడు ◆ తెలంగాణా పోరాట ఇతివృత్తంతో రాసిన త్వమేవాహం (1949) కావ్యం చదివి ఇక నేను పద్యాలు రాయక పోయినా పరవాలేదు అని మహాకవి శ్రీశ్రీ ప్రశంస పొందిన ఆరుద్ర. ◆ శ్రీశ్రీ  తర్వాత యువతరంపై ఎక్కువముద్ర పడిన కవిగా పేరు పొందిన ఆరుద్ర అభ్యుదయకవి, పండితుడు, పరిశోధకుడు, నాటక కర్త మరియు విమర్శకుడు.ఈయన భార్య కె.రామలక్ష్మి కూడా ప్రముఖ తెలుగురచయిత్రి. ■ ఆరుద్ర 1925, ఆగస్టు 31న విశాఖపట్నంలోజన్మించాడు. విశాఖపట్నం ఎ.వి.యన్. కాలేజీ ఉన్నత పాఠశాల లో , తర్వాతవిజయనగరంలోయం.ఆర్.కళాశాలలో ఆరుద్ర విద్యాభ్యాసం చేశాడు. ■ క్విట్ ఇండియా ఉద్యమ కాలంలో చదువుకు స్వస్తి పలికి 1943-47 మధ్యకాలంలో రాయల్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్‍లో గుమ్మస్తాగా పనిచేశాడు. ఆ తర్వాత కొంతకాలం సంగీతంపై దృష్టిని నిలిపాడు. ■ 1947-48 లో చెన్నై నుంచి వెలువడే ప్రముఖ వారపత్రిక ' ఆనందవాణి' కి సంపాదకుడిగా ఉన్నాడు. ఈ పత్రికలో శ్రీశ్రీ , chittooru balaji ఆరుద్ర వ్రాసిన కవితలు అప్పట్లో తీవ్ర సంచలనం సృష్టి...

సింధు నాగరికత - విశేషాలు !!

 సింధు నాగరికత  ప్రాచీన నాగరికతల్లో సింధు నాగరికత ముఖ్యమైనది. అంతేకాకుండా భారతీయ నాగరికతల్లో ప్రథమమైనది. సర్‌ మార్టిమల్‌ వీలర్‌ ప్రకారం హరప్పా నాగరికత మిగిలిన నాగరికతలన్నింటి కంటే ఎక్కువ ప్రదేశాల్లో విస్తరించింది. సింధు లోయ ప్రాంతంలో ఆవిర్భవించింది కాబట్టి దీనిని సింధు నాగరికత అని కూడా పిలుస్తారు. మొదటగా సింధు నాగరికతకు సంబంధించిన ఆనవాళ్లు హరప్పాలో బయల్పడ్డాయి కాబట్టి దీనిని హరప్పా నాగరికత అని కూడా అంటారు. హరప్పా నాగరికతకు దక్షిణాసియాలో మొదటి పట్టణ నాగరికతగా విశిష్ట స్థానముంది. అందుకే కె.ఎన.దీక్షిత దీనిని ‘మూల భారతీయ నాగరికత’ అని కూడా పేర్కొన్నారు. ఇది కాంస్య యుగానికి చెందిన నాగరికత. ఈ నాగరికత ఉత్తరాన జమ్ము నుంచి దక్షిణాన నర్మదా నది వరకు, పశ్చిమాన బెలూచిస్థానలోని మక్రాన తీరం నుంచి తూర్పున ఉత్తరప్రదేశలోని మీరట్‌ వరకు దాదాపు ఒక మిలియన చదరపు కిలోమీటర్ల వైశాల్యంలో విస్తరించింది. అంతేకాకుండా భారత-పాక్‌ ఉపఖండంలోని సింధ్‌, పంజాబ్‌, బెలూచిస్థాన, గుజరాత, రాజస్థాన, పశ్చిమ ఉత్తరప్రదేశ ప్రాంతాల్లో విస్తరించి ఉంది. ఈ నాగరికత విస్తరించిన ప్రాంతం ఉత్తరం - జమ్ము దక్షిణం- నర్...