*
అసలేంటీ బీఎస్-3?*
*🛵ప్రజల ఆరోగ్యం కంటే.. వాహన ఉత్పత్తిదారుల వాణిజ్య ప్రయోజనాలు ఎంతమాత్రం ముఖ్యం కాదు’.. భారత్ స్టేజ్-3(బీఎస్-3) వాహనాల అమ్మకం, రిజిస్ట్రేషన్ల నిలిపివేత సందర్భంగా అత్యున్నత న్యాయస్థానం చేసిన వ్యాఖ్య ఇది. దేశంలో బీఎస్-3 వాహనాల అమ్మకంపై నిషేధం విధించాలని కోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో అసలేంటీ బీఎస్-3? దీనిపట్ల ఎందుకు జాగ్రత్తలు తీసుకోవాలి? ఎందుకు దీన్ని నిలిపివేయాలని కోర్టు ఆదేశించిందో చూద్దాం.*
*🔽ఏమిటీ వాహన ఉద్గార నిబంధనలు?*
*బీఎస్-3 అనేది వాహన ఉద్గార ప్రమాణాలకు సంబంధించిన అంశం. దీని ద్వారా వాహనాల నుంచి వెలువడే కాలుష్యం ఎంత స్థాయి వరకు ఉండాలో నిర్ణయిస్తారు. వాయుకాలుష్యం, గ్లోబల్ వార్మింగ్‌ను పరిశీలించేందుకు ఈ విధానం ఉపకరిస్తుంది.*
*
దీని గురించి ఇప్పుడే ఎందుకు?*
*దేశంలో ఏప్రిల్ 1 నుంచి బీఎస్-4 ప్రమాణాలు అమల్లోకి రానున్నాయి. అలాంటి వాహనాలనే విక్రయించాలని బుధవారం సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. దీని ప్రకారం దేశంలో ప్రస్తుతం ఉన్న బీఎస్-3 వాహనాలను మార్చి 31లోపు విక్రయించాలని.. ఆ తరువాత కొన్న వాహనాలకు రిజిస్ట్రేషన్లు అనుమతించవద్దని అత్యున్నత న్యాయస్థానం తీర్పులో పేర్కొంది. ఇప్పటికే దేశంలోని పలు ప్రాంతాల్లో బీఎస్-4 ప్రమాణాలకు అనుగుణంగా వాహన అమ్మకాలు జరుగుతున్నాయి.*
*
బీఎస్-4 అంటే? మిగతా వాటితో దీనికేంటి పోలిక?*
*బీఎస్-3, బీఎస్-4 అనేవి వాహనాల ప్రమాణాల ఆధారంగా నిర్ణయిస్తారు. బీఎస్-3 నుంచి వచ్చే ఉద్గారాల కంటే బీఎస్-4లో విడుదలయ్యే ఉద్గారాల సంఖ్య తక్కువగా ఉంటుంది. ఉద్గారాల బట్టే కాలుష్య ప్రభావం ఆధారపడి ఉంటుంది. బీఎస్-3లో కిలోమీటర్‌కు 2.30 గ్రాముల కార్బన్‌డయాక్సైడ్ వెలువడేందుకు అనుమతి ఉంది. బీఎస్-4లో దాన్ని 1గ్రాముకే పరిమితం చేశారు.*
*
దీనికి ఎందుకు అంత ప్రాధాన్యం?*
*
ఇటీవల కాలంలో బీఎస్-3 నుంచి బీఎస్-4కి మారే క్రమంలో వివాదం నెలకొంది. బీఎస్-3 వాహనాల విక్రయానికి ఏప్రిల్ 1 గడువుగా నిర్ణయించినప్పటికీ ఆ తరువాత కూడా వాటిని అమ్మేందుకు అమ్మకందారులు యోచన చేశారు. వాహనాల ఉత్పత్తికి మాత్రమే నిషేధం గడువు వర్తిస్తుందని వారు వాదించారు.*
*
దీని అమలు వెనుక .*.
*దేశవ్యాప్తంగా బీఎస్-4 విధానాన్ని తీసుకురావడానికి ముందు ఇప్పటికే కొన్ని నగరాల్లో దీన్ని కఠినంగా అమలు చేస్తున్నారు. 2010 నుంచి దిల్లీ, నోయిడాతోపాటు 13 నగరాల్లో దీన్ని అమలు చేస్తున్నారు. దేశవ్యాప్తంగా దీన్ని అమలు చేయడంతో వాయుకాలుష్యాన్ని లెక్కించేందుకు వీలవుతుంది. తద్వారా అమ్మకందారులు, వాహన చోదకులు దేశంలోని ఇతర ప్రాంతాల్లో దీన్ని దుర్వినియోగం చేసే వీలుండదు. బీఎస్-3 వాహనాల కంటే బీఎస్-4 వాహనాల్లో కాలుష్యస్థాయి తక్కువగా, సాంకేతికంగా ఇవి బీఎస్-3 కంటే మెరుగ్గానూ ఉంటాయి. బీఎస్-4 వాహనాల ధర.. బీఎస్-3 కంటే అధికంగా ఉంటుంది.*
*
ఇంధనం సంగతేమిటి?*
*🛴బీఎస్-4 విధానం వలన వాహనాల నాణ్యతే కాకుండా మెరుగైన ఇంధనం కూడా లభ్యం కానుంది. దీనికి పెట్రోలియం, సహజ వాయు మంత్రిత్వశాఖ బాధ్యత వహించనుంది. బీఎస్-3 వాహనాలనూ ఈ ఇంధనం ద్వారా నడిపించవచ్చు.*
*
ఇప్పుడు ఉత్పత్తి చేసిన బీఎస్-3 వాహనాల పరిస్థితేంటి?*
*
సుప్రీంకోర్టు నిర్ణయం నేపథ్యంలో ఉత్పత్తి సంస్థలు ఇప్పుడున్న బీఎస్-3 వాహనాల ఇంజిన్‌ను మళ్లీ మార్పు చేయాల్సి ఉంటుంది. మూడేళ్ల క్రితం తయారైన వాహనాల విషయంలో ఎలాంటి మార్పులు చేయడానికి అవకాశముండదు.*
*దేశంలో ఉన్న వాహనాల సంఖ్య దేశీయంగా ఉన్న వాహనాల సంఖ్యను పరిశీలిస్తే.
*
.
*పాసింజర్ వాహనాలు: 2.79 మిలియన్ యూనిట్లు*
*కమర్షియల్ వాహనాలు: 0.69 మిలియన్లు*
*ద్విచక్రవాహనాలు: 16.50 మిలియన్లు*
*తిచక్ర వాహనాలు:0.54మిలియన్లు*
*మొత్తం: 20.47 మిలియన్‌యూనిట్లు*
*పెరగనున్న వాహనాల ధరలు*
*
బీఎస్-4 సౌకర్యం కలిగిన వాహనాల ధరలు బీఎస్ 3 కంటే దాదాపు 10శాతం వరకు అధికంగా ఉండే అవకాశముంది. ఆయా సంస్థలు, మోడళ్ల బట్టి ఈ పెంపు ఆధారపడి ఉంటుంది.*
*తరువాతేంటి?*
*
బీఎస్-4 తరువాత బీఎస్-5 ను తప్పిస్తున్నట్లు కేంద్రం గత ఏడాది జనవరిలో ప్రకటించింది. తరువాత వచ్చే బీఎస్-6 ప్రమాణాలు 2020 నుంచి ప్రారంభం కానున్నాయి.*
Comments
Post a Comment